ధర్మారం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో పోల్ టు పోల్ తనిఖీలు
ధర్మారం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో పోల్ టు పోల్ తనిఖీలు
వెంకటాపురం నూగురు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం 11 కె.వి. ఫీడర్ పైన లాసెస్ ఎక్కువ ఉండడం వలన విద్యుత్ పోల్ టు పోల్ తనిఖీలను సోమవారం నిర్వహించారు. వెంకటాపురం విద్యు త్ శాఖ సబ్ డివిజనల్ ఇంజనీర్ ఆకీటి స్వామి రెడ్డి పర్య వేక్షణలో ఏటూరునాగారం నూగూరు వెంకటాపురం సబ్ డివి జన్ పరిధిలోని, ఇంజనీర్లు,సిబ్బంది పాల్గొన్నారు.గృహ అవస రాలు 657 సర్వీసులు, 25 వాణిజ్య పరమైన సర్వీసులు, 02 పరిశ్రమ కేటగిరి, 13 వీధి దీపాల కేటగిరి, 02 వాటర్ వర్క్స్ కేటగిరి సర్వీసులను తనిఖీలు చేశారు. అందులో 22 మీటర్లు ఆగి పోగా, 11 మీటర్లను కాలిపోయిన మీటర్లను గుర్తించారు. మొత్తము 220 మీటర్లకు సీల్స్ వేయడము జరిగింది. పై వాటిలో 12 మీటర్లను కేటగిరి మార్పు తో ఒకటి నుండి రెండుకు (గృహ వినియోగము నుండి వాణిజ్య వినియో గం) 06 తెఫ్ట్ కేసులను గుర్తించారు. 54,630 రూ. బకాయి విద్యుత్ బిల్లులను వినియోగదారుల నుండి పెండిం గ్ బిల్లులు రికవరి చేశారు.ఏటూరునాగారం సబ్ డివిజన్, వెంకటాపురం సబ్ డివిజన్ పరిధిలోని ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఏడిఇ ఆకిటి స్వామిరెడ్డి మీడియాకు తెలిపారు.