నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకే పొలం బాట
కాటారం, తెలంగాణ జ్యోతి: రైతులకు నాణ్యమైన విద్యు త్తును అందించేందుకే విద్యుత్ శాఖ పొలంబాట అనే కార్య క్రమాన్ని నిర్వహిస్తుందని కాటారం ఏ డి ఇ నాగరాజు పేర్కొ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ ప్రమాదాలను అరికట్టేందుకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేం దుకు నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. అందులో భాగంగా శుక్రవారం మండలంలోని గట్లకుంట, గంగారం గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యల తెలుసుకున్నారు. పొలం బాట ప్రోగ్రాం ద్వారా లూస్ లైన్ ,లీన్డ్ పోల్స్ సరిచేసినట్లు వివరించారు. ట్రాన్స్ కో ఏ ఇ మేఘనాథ్. కిరణ్, లైన్ ఇన్స్పెక్టర్ శంకర్, ప్రవీణ్ పాల్గొన్నారు.