దుమ్ముధూళి తో విసుగెత్తిన ప్రజలు.
- రాస్తారోకో స్తంభించిన రాకపోకలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల రహదారి పై రోడ్లు భవనాల శాఖ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పేరుతో మెటల్ పరిచి బీటీ వేయకపోవటం ఇసుక లారీలు ,ఇతరవాహనాల లేపే దుమ్ము ధూళితో ప్రజల అవస్థలు పడుతున్నారు. మూడు నెలల క్రితం మెటల్ పరిచి నీళ్లు తడపకుండా వదిలివేయడంతో, దుమ్ము ధూళితో ఇసుక లారీలు ఇతర వాహనాల లేపే దుమ్ముతో దగ్గు, జలుబు శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామని, ఈ మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం పంచాయతీ వెంగళరావు పేట గ్రామస్తులు ఆదివారం సాయంత్రం గ్రామస్తులంతా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఆగస్టు నెలలో మెటల్ పరిచి నిర్లక్ష్యంగా వదిలివేయడంతో, వాహనాల కారణంగా ఇసుక లారీల కారణంగా దుమ్ము ధూళి తో ఊరుపై కప్పి వేసి, తామంత అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు ముఖ్యంగా మహిళలు శాపనార్థాలు పెడుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో వెంకటాపురం నుండి చర్ల వైపు అటువైపు నుండి ఇటువైపు వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. గంటకు పైగా సాగిన రాస్తారోకో కారణంగా ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు వెంగళరావుపేట గ్రామానికి చేరుకొని, అధికారులకు తెలియపరచి సమస్య పరిష్కారం చేస్తామని దుమ్ము, ధూళి లేకుండా నీళ్లు చలిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆంధోళన విరమించారు.