నేర నియంత్రణలో ప్రజలు, యువత భాగస్వాములు కావాలి

Written by telangana jyothi

Published on:

నేర నియంత్రణలో ప్రజలు, యువత భాగస్వాములు కావాలి

– ఒక్క సీ.సీ కెమెరా పదిమంది డ్యూటీ తో సమానం. 

– వెంకటాపురం సి.ఐ బి. కుమార్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రస్తుత సమాజంలో నేరాలు రోజురోజుకు కొత్త పందాలో పెరుగుతు న్నాయని,ప్రజలు,యువత భాగస్వామ్యమై నేరాల నియంత్ర ణలో పోలీస్ శాఖకు సహకరించాలని వెంకటాపురం సి.ఐ. బండారి కుమార్ అన్నారు. వాజేడు పిఎస్ పరిధి మురు మూరులో శనివారం కమ్యూ నిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిం చి అనేక భద్రతా పరమైన అంశాలపై గ్రామస్తులకు అవగా హన కల్పించారు. గ్రామంలో ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేర నియంత్ర ణతో పాటు, ఒక సీ.సీ కెమెరా పదిమంది డ్యూటీ తో సమానమని అన్నారు. సీ.సి కెమేరాల ఏర్పాటులో ప్రొవిజన్ వివరించారు. సైబర్ దొంగలు రకరకాల మెసేజ్ల తో తమ బ్యాంకు ఖాతాల నుండి నగదును దొంగిలి స్తున్నారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి ఆశ్రయం కల్పించవద్దని కోరారు. గుడుంబా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పట్ల గ్రామీణ యువత, ప్రజలు ఆకర్షితులు కావద్దని, వాటి సమాచారాన్ని పోలీసులకు తెలియపర చాలన్నారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే గ్రామీణ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి, క్రీడారంగ అవకాశాలపై దృష్టి సారించి ముందుకు సాగాలని సి.ఐ కుమార్ పిలుపునిచ్చారు. బడి వయసు పిల్లలను బడికి పంపించాలని, ఇంకా అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్, సివిల్ మరియు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment