డ్రగ్స్ సమాచారం మాకు.. నగదు బహుమతి మీకు…

Written by telangana jyothi

Published on:

డ్రగ్స్ సమాచారం మాకు.. నగదు బహుమతి మీకు…

– గ్రామాల్లో పేరూరు పోలీస్ పోస్టర్లు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : యాంటీ డ్రగ్స్ క్యాంపియన్ లో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మారం గ్రామంలో పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంపై, గ్రామీణ యువత డ్రగ్స్ కు అల వాటు కాకుండా ప్రజలను చైతన్యవంతం చేయడానికి యాంటీ డ్రగ్స్ క్యాంపియన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు నడుం బిగించి పోలీస్ శాఖకు సహకరించాలని, మాదక ద్రవ్యాలతో జరిగే కష్ట నష్టాలను గ్రామీణులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ పోస్టర్లను ప్రధాన వీధులలో పోలీస్ శాఖ అంటించింది. అలాగే గ్రామీణ యువత తమ ఉజ్వల భవిష్యత్తును డ్రగ్స్ కారణంగా పాడు చేసుకోవద్దని, గ్రామీణ యువత విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాల తో ముందుకు సాగాలని, త్వర లో జరగబోయే జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు సిద్ధం కావాలని యువతకు పేరూరు ఎస్సై జి. కృష్ణ ప్రసాద్ పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేరూరు సివిల్ పోలీసుల తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment