భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

– అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు.

– స్వచ్ఛందంగా పునరావాస కేంద్రానికి ప్రజలు తరలి రావాలి.

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అన్నారు. శనివారం కన్నాయిగూడెం మండలం కంతాన్‌పల్లి 2వ లోలెవల్‌ వంతెన, గోవిందరావు పేట మండలం లోని రాఘవపట్నం దయ్యాల వాగు వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని కలెక్టర్ సూచించారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారు లను సూచించారు. గోదావరికి ఎగువనున్న నుండి వచ్చే వరదకు వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తహశీల్దార్ లు, ఎంపిడివో లు తమ మండల పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకో వాలని అధికారులకు సూచించారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డ్ లు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కొరారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా బారికేడ్లు, ప్లాస్టిక్ కోన్స్, త్రెడ్ మరే ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా చూడాలన్నారు.వర్షాలకు లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ అధికారులు విధ్యుత్, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలోని చెరువు లు, కుంటలు, ప్రోజెక్ట్ లలోని నీటి మట్టాలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారు లను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో పంచాయితీ సెక్రటరీ లు సైతం తమ పరిధిలోని చెరువుల నీటి మట్టాలను గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభిం చి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.గ్రామ స్థాయి అధికారు లు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, ఐకేపీ సీసీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి జ్వరాలు, డెంగ్యూ, ఇతర కేసులను గుర్తించి తక్షణమే జాగ్రత్తలు తీసుకుని వైద్య సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలన్నారు.నీటిపారుదల శాఖ సిబ్బంది ఏ ఈలు వారి వారి పరిధిలోని చెరువులను తనిఖీ చేయాలి. సందర్శించిన ఫోటోలను సమర్పించాలని,  ఏదైనా అత్యవసర మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి పూర్తి చేయాలి. ఈ ఈ ల ద్వారా నివేదికలను సమర్పించాలన్నారు. గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోందని, ఈ వరద వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు, రహదారుల గురించి, సమాచా రం ప్రజలకు చేరవేయాలి. ఆ ప్రాంతంలో రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముంపు ప్రాంతాల ప్రజలు ఎగువ సురక్షిత ప్రదేశానికి తరలించాలి. వర్షాలు మరియు పారిశుధ్యం, ఆరోగ్య సమస్యల పరంగా రానున్న 2 రోజులు మరింత క్లిష్ట మైనవి. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ముంపు సమస్యలపై శ్రద్ధ వహించాలి. ఏదైనా అత్యవసర పరిస్థి తులను తన దృష్టికి తేవాలని ఆదేశించారు. సాయక చర్యలు జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నారని ప్రజలు సహకరించాలని, ప్రజల అత్యవసరం అయితే తప్ప బయ టకు వెళ్లొద్దని సూచించారు.వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహా యం కొరకు ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్‌ రూమ్‌ సెల్ నెంబర్. 6309842395. ల్యాండ్ లైన్ నెంబర్ 08717-293246 లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులోఉంటూ, వర్షానికి, జలమాయమయ్యే ప్రాంతా ల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, తహసిల్దార్, ఎంపి డి ఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.