పటేల్ యూత్ గర్జన సభను విజయవంతం చేయాలి
– జర్నలిస్ట్ ఫోరం ములుగు జిల్లా అధ్యక్షులు పిట్టల మధుసూదన్ పటేల్
ములుగు, తెలంగాణ జ్యోతి: ఈనెల 14 న (ఆదివారం) కరీంనగర్ లో జరిగే పటేల్ యూత్ గర్జన సభ విజయవంతం చేయాలని మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం ములుగు జిల్లా అధ్యక్షులు పిట్టల మధుసూదన్ పటేల్ శుక్రవారం కోరారు. పటేల్ యూత్ గర్జన సభ లో పలు అంశాలపై చర్చ అనంతరం పటేల్ గెజిట్ కోసం గ్రామ స్థాయి నుండి, మండలం, డివిజన్, జిల్లా, ప్రెస్ అప్ గవర్నమెంట్ వరకు గెజిట్ కోసం కావలసిన, పత్రాలు, వాటి పూర్తి వివరాలు కులం కుశంగా చర్చ ఉంటుందన్నారు. ఇకనుండి ప్రతి మున్నూరు కాపు కులస్తులకు పటేల్ పేరు తప్పనిసరిగా గెజిట్ తీసుకొస్తామని, అలాగే వివిధ గ్రామాల నుండి హైదరాబాద్ వరకు వెళ్లి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు వేరువేరుగా వెయ్యి మంది తో కూడిన బాలికల హాస్టల్ వసతి గృహం ఏర్పాటు కు తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మున్నూరుకాపు యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.