పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో నిర్వహిస్తాం
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో నిర్వహిస్తాం
– ఎస్పీ డాక్టర్ పి.శబరీష్
– ములుగులో పోలీసు ఫ్లాగ్ మార్చ్
ములుగు,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లాలో పార్లమెంటు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహి స్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆధ్వర్యం లో పోలీసులు ప్రత్యేకంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల ప్రతినిధులు నిబంధనల మేరకు నడుచుకోవా లన్నారు. ఎలక్షన్ ప్రచారం కోసం ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరిం చాలని కోరారు. ప్రజలు సైతం ఎలాంటి ప్రలోభాలకు లొంగొ ద్దని, నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ మేకల రంజిత్, ఎస్సైలు వెంకటేష్, లక్ష్మారెడ్డి, రామకృష్ణ, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.