పంతకాని రాజుకు “వరల్డ్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే”అవార్డు

పంతకాని రాజుకు "వరల్డ్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే"అవార్డు

పంతకాని రాజుకు “వరల్డ్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే”అవార్డు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ పంతకాని రాజు “ఆదివాసీ జీవన కళా సౌందర్యము” పై తీసిన ఫోటో కు “పిక్టోరియల్” “కళాత్మక ఉత్తమ ఛాయా చిత్రకారుడి అవార్డు లభించింది. 132వ “వరల్డ్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే” డిసెంబర్ 1 సందర్భంగా ఉభయ రాష్ట్రాలకు “ఆచార్య నాగార్జున యూనివర్సిటీ” ఆధ్వర్యంలో “ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్” & “ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా” సహకారంతో నిర్వహించిన “ఫోటో కాంటెస్ట్” లో ఈ అవార్డు లభించింది. ఈ రోజున గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రోఫెసర్ రామ మోహన రావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ గంగాధర రావు, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ బాధ్యులు డా.మధు బాబు, కార్యక్రమ సమన్వయ కర్త తమ్మ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్, మెడల్ ను అందుకున్నారు. ప్రకృతి, సహజమైన జీవన చిత్రాలు రేపటికి ఒక రూపంగా, కళాత్మకంగా భద్రపరిచే పిట్రోరియల్ ఫోటోగ్రఫీలో ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉందని పంతకాని రాజు అన్నారు.