ఇండియా ఫోటోగ్రఫీ సమ్మిట్ లో పంతకాని రాజు ఛాయాచిత్రం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : హైద్రాబాద్ లో ఈ నెల 15న జరిగిన ఇండియా ఫోటోగ్రఫీ సమ్మిట్-ఐ పీ ఎస్ 2024 జాతీయ ఛాయాచిత్ర పోటీల్లో మహాదేవపూర్ ఫోటో గ్రాఫర్ పంతకాని రాజు తీసిన ఫోటో ఉత్తమ ఛాయాచిత్రంగా ఎంపికైంది. పండుగలు వాటి ప్రాముఖ్యత అనే అంశంపై మహారాష్ట్ర కొల్హాపూర్ ‘పఠాన్ కొడలి’ లో జరిగిన పసుపు పండుగ మీద తీసిన ఛాయచిత్రం జాతీయ ఉత్తమ ఛాయా చిత్రంగా రాణించడం గర్వంగా ఉందని ఫోటోగ్రాఫర్ పంతకాని రాజు అన్నారు. ఐ పీ ఎస్ ఇండియా ఫోటోగ్రఫీ సమ్మిట్ మ్యాగజైన్ లో నేను తీసిన “హల్దీ ఫెస్టివల్” ఛాయాచిత్రం ప్రచురించడం చాలా సంతోషంగా ఉందని, ఒక ఫొటోగ్రాఫర్ గా ఇంతకంటే సాధించాల్సింది ఇంకేముందని అన్నారు.