ఘనంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి 53 వ జన్మదిన వేడుకలు
నర్సంపేట, తెలంగాణ జ్యోతి : పట్టణంలోని మహిళ ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క 53వ జన్మదిన వేడుక లను కాంగ్రెస్ పార్టీ ఆదివాసి మహిళా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీతక్క కు శుభాకంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీతక్కను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. ఆదివాసి కుటుంబంలో పేదరికంగా పుట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆదివాసి కుటుంబాలకు అండగా ఉంటూ అన్ని వర్గాల వాళ్లకు కూడా మేలు చేయడమే తన లక్ష్యమని ముందడుగు వేస్తున్న సీతక్క కు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి దక్కడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో. మెరుగు శ్రీనివాస్ ,పోడెం రాణి, ఇర్ఫా పూలమా, సుంచ హైమావతి, కల్తీ నాగలక్ష్మి, కంటెం సుహాసిని, ధనసరి కళావతి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.