ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
– అభివృద్ధి ప్రదాత సీఎం రేవంత్ రెడ్డి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో బుదవారం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అభినందనలు తెలిపారు. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పట్ల అసెంబ్లీలో ఆమోదింపజేశారని, అలాగే ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదల సంక్షేమమే తమ ధ్యేయంగా విద్య, వైద్యం వ్యవసాయరంగం, మహిళా సంక్షేమం, ఇంకా అనేక రంగాలలో సమాన న్యాయం కలిగించేందుకు అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనీయులని పరిపాలన దక్షులని కొనియాడారు. ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నూగురు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ పూనెం రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతో పాటుమండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, నూగురు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టం సాయి, మాజీ ఎంపీటీసీ రవి, కాంగ్రెస్ నాయకులు ,యాలం సాయి. మనోజ్, పిల్లారిశెట్టీ మురళి నాయుడు, జల్లిగంపల కళాధర్ నాయుడు, సీనియర్ నాయకులు మద్దుకూరి ప్రసాద్, డర్రా రవిలు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.