కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యా న్ని విక్రయించుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని వెంక టాపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చి డెం మోహన్ రావు రైతులను కోరారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఏ గ్రేడ్ ధాన్యాని కి క్వీంటాలుకు 2,320, సన్న ధాన్యానికి క్వింటాలుకు 500 రూ. ప్రభుత్వ పరంగా బోనస్ చెల్లిస్తారని తెలిపారు. అలాగే బి. గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,300 చొప్పున ప్రభుత్వ మద్దతు ధర రైతులకు చెల్లిస్తారని చెప్పారు. తేమ శాతం తాలు, తప్ప ఇతర నాణ్యతలను ఏ.ఇ.ఓ. నియమ నిబంధన ల ప్రకారం పరిశీలించి టోకెన్ ఇస్తారని తెలిపారు. ఆరబెట్టిన ధాన్యం తేమ శాతం పరిశీలించి, ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఆర్. వి .వి సత్యనారా యణ స్వామి, సిబ్బంది తోట పూర్ణ, మాజీ సర్పంచ్ కొరస నరసింహమూర్తి ,రైతులు మడకం రమణయ్య, కృష్ణమూర్తి, చెరుకూరి సురేష్, ఉండం లక్ష్మయ్య, అట్టం సత్యనారాయణ ,కొండగొర్ల విజయ్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.