ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
– యూనియన్ నాయకులు గాదె రమేష్,ఎండి ఫజల్
ములుగు, తెలంగాణ జ్యోతి : వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన నియామకంలో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ మెడికల్ & హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు గాదె రమేష్,ఎండి ఫజల్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా వైద్యాధికారి ఆల్లెం అప్పయ్య,ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ ను కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బందికే నియామకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నర్సింగ్ చేసిన విద్యారుల మార్కులు1200,జి ఎన్ ఎం ల మార్కులు 1900, ప్రస్తుత నర్సింగ్ విడ్యారుల మార్కులు 2900 ఉన్నపుడు ప్రస్తుత మార్కులను ప్రామాణికంగా తీసుకుంటే గతంలో నర్సింగ్ కోర్సులు చేసిన వారు నష్ఠపోతున్నారని అన్నారు. భూపాలపల్లి జిల్లా ఉన్నపుడు నియామకం అయి, ములుగు జిల్లా ఏర్పడగానే వారిని తొలగించడం సరికాదని అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులు వచ్చినా కరోనా కష్టకాలంలో పనిచేసిన సిబ్బందిని విస్మరించడం సరికాదన్నారు. ముగిసిన దోబీ కాంట్రాక్ట్ పై నిర్ణమం తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా న్యాయపరమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు గాదె రమేష్ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎండి ఫజల్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు సర్దార్ వేణు నాయక్ తిరుపతి వంగ రాజయ్య కుమార్ రమేష్ రవి విజయ్ తదితర వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.