ములుగులో కాలం చెల్లిన స్కూల్ బస్ లు..?

ములుగులో కాలం చెల్లిన స్కూల్ బస్ లు..?

ములుగులో కాలం చెల్లిన స్కూల్ బస్ లు..?

– కాలపరిమితి ముగిసిన బస్సులను నడిపిస్తున్న బిట్స్

– ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

– స్వాధీనం చేసుకున్న ఆర్టీవో?

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని బిట్స్ పాఠశాల యాజమాన్యం పాఠశాల బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోంది.. కాలపరిమితి పూర్తయిన బస్సులను గ్రామాలకు పంపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బిట్స్ స్కూలు సంబంధించిన వాహన కాల పరిమితి అయిపోయినప్పటికీ బిట్స్ స్కూలు యజమాని ఆ వాహనాన్ని నడుపుతూ అందులో విద్యార్థు లను తరలిస్తున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆర్టీవో బస్సు పత్రాలను పరిశీలించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆర్టీవో కార్యాలయానికి వాహనాన్ని తరలించి స్కూల్ యాజమాన్యం కు జరిమానా విధించినట్లు సమాచారం. కాల పరిమితిలేని వాహనాన్ని నడుపుతూ నిర్లక్ష్యం వహించిన స్కూలు యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు

  • ఫిట్నెస్ లేని స్కూలు బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు
  • ఆర్టీవో ఎండి సిరాజ్ ఉర్ రెహమాన్

ములుగులో కాలం చెల్లిన స్కూల్ బస్ లు?
- కాలపరిమితి ముగిసిన నడిపిస్తున్న బిట్స్
- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
- స్వాధీనం చేసుకున్న ఆర్టీవో?
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని బిట్స్ పాఠశాల యాజమాన్యం పాఠశాల బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోంది.. కాలపరిమితి పూర్తయిన బస్సులను గ్రామాలకు పంపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బిట్స్ స్కూలు సంబంధించిన వాహన కాల పరిమితి అయిపోయినప్పటికీ బిట్స్ స్కూలు యజమాని ఆ వాహనాన్ని నడుపుతూ అందులో విద్యార్థులను తరలిస్తున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆర్టీవో బస్సు పత్రాలను పరిశీలించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆర్టీవో కార్యాలయానికి వాహనాన్ని తరలించి స్కూల్ యాజమాన్యం కు జరిమానా విధించినట్లు సమాచారం. కాల పరిమితిలేని వాహనాన్ని నడుపుతూ నిర్లక్ష్యం వహించిన స్కూలు యజమానిపై సంబంధిత 
 అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు

*ఫిట్నెస్ లేని స్కూలు బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు*

*ఆర్టీవో ఎండి సిరాజ్ ఉర్ రెహమాన్*

ములుగు జిల్లాలో ప్రైవేట్ స్కూలు యజమానులు కాల పరిమితి లేని బస్సులను ఫిట్నెస్ లేని బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీవో ఎండి సిరాజ్ ఉర్ రెహమాన్ అన్నారు అలాగే ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బిట్స్ స్కూల్ యజమాని కాలపరిమితి అయిపోయిన బస్సులు నడుపుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు సమాచారం అందువల్ల ఆ బస్సులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారుములుగు జిల్లాలో ప్రైవేట్ స్కూలు యజమానులు కాల పరిమితి లేని బస్సులను ఫిట్నెస్ లేని బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీవో ఎండి సిరాజ్ ఉర్ రెహమాన్ అన్నారు అలాగే ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బిట్స్ స్కూల్ యజమాని కాలపరిమితి అయి పోయిన బస్సులు నడుపుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు సమాచారం అందువల్ల ఆ బస్సులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు