మన ఊరు మన జూనియర్ కళాశాల. 

Written by telangana jyothi

Published on:

మన ఊరు మన జూనియర్ కళాశాల. 

– సమిష్టిగా మౌలిక సదుపాయాలకల్ఫణకు కృషి చేద్దాం

వెంకటాపురం కాలేజీ అభివృద్ధికి సర్వసభ్య సమావేశం లో తీర్మానం

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల కు మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు , సమిష్టిగా కృషిచేసి మన ఊరు, మన నూతన జూనియర్ కళాశాల అనే ధ్యేయంతో కలిసికట్టుగా కళాశాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేద్దామని సర్వసభ్య సమావేశం తీర్మానించింది. సోమవారం వెంకటాపురం మండల కేంద్రంలోని నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యాలయంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీలు, ప్ర జాప్రతినిధులు, సంఘాలు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు  మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ విజయ్ కుమార్, అకాడమిక్ ఇన్చార్జి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, కళాశాల లెక్చరర్లు సంయు క్తంగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంకటాపురం మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేయడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. అలాగే కళాశాలలో ఇప్పటివరకు సుమారు 58 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. అలాగే కళాశాలకు ప్రభుత్వం 353 సీట్లు కేటాయించిందని, 4 వేల పాఠ్యపుస్తకాలు మంజూ రయ్యాయని వాటిని విద్యార్థులు కు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కళాశాలలో బైపిసి,హెచ్ఈసి, సిఇసి, ఎంపీసీ తదతర గ్రూపులుతో తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో మంజూరైనట్లు.ప్రిన్సి పాల్ తెలిపారు. పూర్వ విద్యార్థులు కళాశాల ప్రారంభం సమయంలో విద్యార్థులకు బెంచీలు, ఫ్యాన్లు, వాటర్ క్యాన్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే రాజకీయ పక్షాలు తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ లు మాట్లాడుతూ తమ పార్టీ తరఫున నూతన కళాశాలకు విద్యార్థులు కూర్చునేందుకు విరాళంగా పది బెంచీలు అందజేయనున్నట్లు సభ ముఖంగా విరాళం ప్రకటించారు. అలాగే సిపిఎం పార్టీ తరఫున మండల కార్యదర్శి కుమ్మరి శీను మాట్లాడుతూ కాలేజి మౌలిక సదుపాయాలు కల్పనకు తమ పార్టీ తరపున 10 వేల రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సిపిఐ నాయకులు తోట మల్లికార్జునరావు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు కొండూరి ప్రసాద్, ఉపాధ్యాయులు బొల్ల్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడెం శివ, ఉపాధ్యాయులు బి. శ్రీనివాసరావు ఇంకా పలువురు ప్రము ఖులు కళాశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదిత అంశాలపై సలహాలు సూచనలుతో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో మన ఊరు మనబడి పథకం కింద నిర్మించిన పాఠశాల భవనం లో రెండు గదులకు ఫ్లోరింగ్, ఇతర  చిన్న పనులు నిమిత్తం ములుగు జిల్లా కలెక్టర్ 10 లక్షలు రూపాయలు మంజూరు చేసినట్లు, ఈ మేరకు కాంట్రాక్టర్ అసంపూర్తిగా ఉన్న పనులు వేగవం తంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయకుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పది లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు సమావేశం కలెక్టర్కు అభినందనలు తెలిపారు. సమావేశంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్వీ సత్యనా రాయణ సైతం పాల్గొన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య అడ్మిషన్స్ సంఖ్య ,పెరిగిన సమయాల్లో ఉన్నత పాఠశాల, కాలేజీల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సమయాలకు అనుకూలంగా షిఫ్ట్ పద్ధతులు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ మేరకు ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, జూనియర్ కళాశాల నిర్వహణలో సహకరిం చాలని కోరారు. జూనియర్ కళాశాల భవన నిర్మాణం కొరకు దశలి పట్టు పరిశ్రమ శాఖ సెరికల్చర్ స్థలాన్ని కేటాయించాలని సమావేశం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. సుమారు 25 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న సెరికల్చర్ ప్రభుత్వ స్థలంలో ఐదు ఎకరాలు జూనియర్ కళాశాల భవన నిర్మాణాలకు కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు సహకారంతో,మంత్రులు సహకారంతో ప్రభుత్వం నుండి జూనియర్ కళాశాల అభివృద్ధికి భవన నిర్మాణ కోసం నిదులు మంజూరు , మరియు స్థలం ఎంపిక తదితర పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కళాశాల అభివృద్ధికి కృషి చేస్తుందని, సొసైటీ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ తదితరులు సమావేశంలో ప్రకటించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్, పూర్వ విద్యార్థుల సంఘం తరఫున కే. ప్రసాద్, బిజెపి మండల అధ్యక్షులు ఏ. రఘురాం, సిపిఎం పార్టీ నాయకులు కుమ్మరి శీను, జి .వాసు,కాంగ్రేస్ నేత చిట్టెంటాకయ్య ,బిఆర్ఎస్ నేతలు వేల్ఫూరి లక్ష్మీ నారాయణ ,జాగర శివాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి జూనియర్ కళాశాల భవనా ల నిర్మాణాల కొరకు 5 ఎకరాలు స్థలాన్ని కేటాయిస్తే, వారి పేరుతో స్దాతదాతగాగా పేరు నమోదు, కాలేజి కి దాత పేరు నామకరణం చేయడం జరుగుతుందని ,అటువంటి దాతలు ముందుకు వస్తే వారికి స్వాగతం పలుకుతూ, కళాశాల అభివృద్ధి కి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, పదిలో 140 కు పైగా పదో తరగతివిధ్యర్థులు ఉన్నారు. వారంతా పాస్ అవకాశం ఉందని, వారందరికీ ప్రస్తుత జూనియర్ కళాశాలలోనే అడ్మిషన్ పొందే విధంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ నిర్వహించి, అడ్మిషన్ల సంఖ్య పెంచుకుందామని కథ మార్చి నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల హెచ్ఎం ఆర్ వి సత్యనారాయణ ఉపాధ్యాయుడు బి శ్రీనివాస్ సమావేశంలో తెలిపారు. గత మార్చి నెలలో వెంకటాపురం హైస్కూల్ నుండి 132 మంది పదో తరగతి ఉత్తీర్ణ సాధించారని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 140 మంది టెన్త్ విద్యార్థులు చదువుకుం టున్నారని, స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందే విధంగా తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు, దీంతో కళాశాల పూర్తిస్థాయి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని, మన ఊరు మన జూనియర్ కళాశాల అని అందరం కలిసికట్టుగా పనిచేసి కళాశాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ సమావేశంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ విజయకుమార్, అకాడమిక్ ఇన్చార్జి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, పాఠశాల హెచ్ఎమ్ సత్యనారాయణ, రాజకీయ పార్టీల ప్రముఖులు, గౌరవ ప్రజాప్రతినిధులు, లెక్చరర్లు పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, మీడియా ప్రతినిధులు తదితరులు సర్వసభ్య కళాశాల అభివృద్ధి సమావేశంలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now