కాటారంలో పోలీసుల ఓపెన్ హౌస్ 

కాటారంలో పోలీసుల ఓపెన్ హౌస్ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: పోలీసుల విధులు, బాధ్యతలతో పాటు వాటి పట్ల అవగాహన కల్పించడానికి ఓపెన్ హౌస్ నిర్వహించినట్లు కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ లో గారెపల్లి లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ లో ఆయుధాల పనితీరును డిఎస్పి స్వయంగా వివరించారు. అలాగే పోలీసులు చేపట్టిన షీ టీమ్స్, ట్రాఫిక్ రూల్స్ నిబంధ నలు ఇతరత్రా వివరాలను విద్యార్థులకు అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జు న రావు, సబ్ ఇన్స్పెక్టర్ అభినవ్ పాల్గొన్నారు.