గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం, మండపాక జాతీ య రహదారిపై గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తోలెం పాపారావు (50) మృతి చెందాడు. మండపాక గ్రామానికి చెందిన పాపారావు కాలి నడ కన మండపాక నుండి మైహితాపురం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు పాపారావు సోదరుడు తోలం సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు పోలీస్ ఎస్.ఐ. రుద్ర హరీష్ మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.