గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

Written by telangana jyothi

Published on:

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ములుగు / గోవిందరావుపేట : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట లోని 163జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామానికి చెందిన హైమద్ అలీ (17) ప్రతీ రోజు  తన ఊరి నుంచి గోవిం దరావుపేట మండల కేంద్రానికి పాలు తీసుకొని వెళ్తుంటాడు. దినచర్యలో భాగంగా ఆదివారం రాత్రి 7గంటల ప్రాతంలో తన బైక్ పై గోవిందరావుపేటకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్పాట్ లోనే హైమద్ అలీ చనిపోయాడు. పస్రా ఎస్సై కమలాకర్ సంఘట నా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. బైక్ ను ఏ వాహనం ఢీకొట్టిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a comment