12 రకాల ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి ఓటు వేయవచ్చు
12 రకాల ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి ఓటు వేయవచ్చు
– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి.
– ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమీషన్ కల్పించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డు లేని వాళ్లు ఆధార్ కార్డు, ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ. జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్.పి.ఆర్. కింద ఆర్.జి.ఐ. జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్ పోర్ట్, ఫోటో తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పి.ఎస్. యు.లు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫోటోతో జారీ చేసిన ఐడి కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడి కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడి కార్డు (యు.డి ఐ.డి.) లలో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని తెలిపారు. అర్హులైన ఓటర్ లు తమ ఓటు హక్కును ఎన్ని పనులు ఉన్నా పోలింగ్ రోజు ఏప్రిల్, 13న సమయం కేటాయించి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఆ ప్రకటనలో తెలిపారు.