మేడారం దారిలో.. ప్రమాదపు గుంతలు…
ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రతి రెండేళ్ల కొకసారి జరిగే మేడారం మహా జాతరకు వెళ్లే దారులు పలుచోట్ల ప్రమాద కరంగా గుంతలు ఉన్నాయి. మేడారం నుంచి టప్పమంచ మధ్య ప్రాంతంలో కొన్ని చోట్ల గుంతలు పూడ్చక పోవడంతో వాహన దారులు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మేడారం జాతర ఈనెల 21 న మొదలై 24 తో ముగుస్తుంది. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి ఈసారి రెండు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహన దారులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.