ఫిబ్రవరి 7 న చలో హైదరాబాద్ గోడపత్రిక ఆవిష్కరణ
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరగబోయే వెయ్యి గొంతులు లక్షల డప్పులు కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా నూగురు వెంకటా పురం మండల కేంద్రంలోని ఎస్సీ మర్రిగూడెంలో ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు తోకల శివ మాదిగ ఆధ్వర్యంలో గోడ పత్రికలను అవిష్కరించారు. అనం తరం వావిలాల సాంబశివరావు మాదిగ ములుగు జిల్లా ఎం.ఆర్ పి పిస్ ప్రెసిడెంట్, నూగురు వెంకటాపురం మండల ఇన్చార్జ్ హాజరై మాట్లాడారు. గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీం కోర్టు షెడ్యూల్ కులాల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాదిగ ఉప కులాల సమస్యలను పరిష్కరిస్తామని, విద్యా ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో వారికి అండగా ఉంటామని తెలిపిన ముఖ్య మంత్రి కాలయాపన చేయ కుండా వెంటనే ఏ బి సి డి వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7 చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపుని చ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తోకల శివ మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు యాసం మహేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి వేల్పుల మనోజ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కోకిల మల్లికార్జున మాదిగ, వేల్పుల మల్లేష్ మాదిగ, గ్రామ అధ్యక్షుడు చెన్న వంశీ మాదిగ, గ్రామ ప్రధాన కార్యదర్శి కోగిల ప్రవీణ్ మాదిగ, తిరుపతి, రాంబాబు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
1 thought on “ఫిబ్రవరి 7 న చలో హైదరాబాద్ గోడపత్రిక ఆవిష్కరణ”