మిర్చి నారుమళ్ళకు పాత చీరల సింగారం

Written by telangana jyothi

Published on:

మిర్చి నారుమళ్ళకు పాత చీరల సింగారం

– మొలక దెబ్బతినకుండా రక్షణ. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో వేలాది ఎకరాల్లో ప్రధాన వాణిజ్య, మిర్చి పంటను రైతాంగం సాగు చేస్తున్నది. గోదావరి పరివాహక లంక భూముల్లో సెప్టెంబర్ నెలాఖరు నుండి మిర్చి మొక్కల నాట్లు వేసే కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఎకరానికి 1.50 లక్లల నుండి రెండు లక్షల కు పైగా పెట్టుబడులు పెట్టి ,రైతాంగం మిర్చి సాగు చేస్తున్నది. మిర్చి సాగుకు ముందు, కేజీ విత్తనాలు ఆయారకాలను బట్టి 80,000 నుండి లక్ష రూపాయలకు పైగా ఆయా రకాలను బట్టి రైతాంగం మిర్చి విత్తనాలను కొనుగోలు చేసింది. ఆయా విత్తనాలను నారు దిబ్బలు తయారుచేసి, మిర్చి విత్తనాలను వరుస క్రమంలో నాటి మొలకెత్తి దశలో వర్షాలు, భారీ వర్షాలు,తుఫాన్ సమయంలో వర్షపు చినుకులు కారణంగా మొలక దెబ్బ తినకుండా, పాత చీరలను సంతలలో కొనుగో లు చేసి మిర్చినారు దిబ్బల పై రైతాంగం కప్పుతున్నది. విత్తనాలు నాటిన వారం రోజుల తర్వాత మిర్చి మొలకలు మొలిచి వచ్చే దశలో మొలక వంకర పోకుండా పాత చీరల ను రైతాంగం తొలగిస్తుంటుంది.అలాగే మరి కొంతమంది రైతు సోదరులు అడవులలో దొరికే వెడల్పాటి ఆకులతో ఉన్న చిన్న చిన్న పాల మండలను తీసుకు వచ్చి, విరుచుకొని వచ్చి, వర్షం చినుకులు నుండి ,మిర్చి మొలకలు కాపాడు కునేందుకు నారుదెబ్బలపై కప్పుతున్నారు. ఈ విధానం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుండగా, మరి కొంతమంది రైతులు నూత న సాంకేతిక పరిజ్ఞానంతో, ప్లాస్టిక్ ట్రైల లో  వేలాది రూపా యలు పెట్టుబడి పెట్టి, మిర్చి నారు పెంపకం చేపట్టారు. నారు దిబ్బలపై రకరకాల రంగుల పాత చీరలను కప్పటంతో అందా ల హరివిల్లుగా నారు దిబ్బలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.

Leave a comment