ప్రభుత్వ వసతి గృహాల్లో అధికారుల పల్లెనిద్ర
– విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలపై ఆరా
– విద్యార్థులతో నేరుగా హాస్టల్ లోనే రాత్రి బస
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి:వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ వసతి గృహాన్ని అధికారులు తహ సిల్దార్ లక్ష్మీ రాజయ్య, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్యలు పలేనిద్ర ను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న మెనూ చార్ట్ ప్రకారం, ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అమలవుతున్నాయా, విద్యార్థులు యొక్క పఠనా శక్తి, ఆహారం, పరిసరాల పరిశుభ్రత, ఇతర అంశాలపై నేరుగా ఆశ్రమ పాఠశాలకు, వసతి గృహాలకు అధికారులు వెళ్లి విద్యార్థులతో కలిసి, మెలిసి వారి తోటే భోజనం చేసి అక్కడి పరిస్థితులను తెలుసుకొన్నారు. అనం తరం విద్యార్థులకు వండి, వడ్డించే వంటా వార్పు ఆహార పదా ర్థాలను పరిశీలించి, విద్యార్థులతో భోజనం చేసి అక్కడే రాత్రి బస ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మండలంలోని లక్ష్మీనగ రం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్ పల్లెనిద్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు, వారి ఇబ్బం దులను, ఇతర వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం, పరిసరాల పరిశుభ్రత, విద్యా ర్థుల పఠనా శక్తి, హాజరు, పేరెంట్స్ కమిటీ సమావేశాలు తీర్మానాలు, వారి సలహాలు, రికార్డులను వసతి గృహాల్లో అధికారులు పరిశీలించారు. అనేక అంశాలపై విద్యార్థులతో నేరుగా తెలుసుకొని వారితో పాటే భోజనం చేసి అక్కడే పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. లక్ష్మీ నగరం ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి 252 మంది విద్యార్థులు హాజరు ఉన్నట్లు, ఆశ్రమ పాఠశాలలో పల్లెనిద్రలో పాల్గొన్న ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ మీడియాకు తెలిపారు. విద్యార్థుల యొక్క సమస్యలను, పరిసరాల పరిశుభ్రత, బోధన, పుస్త కాలు, విద్యార్థులకు ఆరోగ్య స్థితిగతులు, పేరెంట్స్ కమిటీ యొక్క సమావేశాలు, తదితర అంశాలపై వెంకటాపురం లోని గిరిజన బాలుర వసతిగృహం, మరియు లక్ష్మీ నగరం ఆశ్రమ పాఠశాల పల్లె నిద్ర కార్యక్రమాల్లో, మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తమ నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆయా వసతి గృహాలు హెచ్.డ బ్లు.ఓలు, ఆశ్రమ పాఠశాలల సంక్షేమ అధికారులు, హెచ్.ఎం. లు ఉపాధ్యాయుల బృందం, ప్రధానోపాధ్యాయులు పాల్గొ న్నారు.