విద్యుత్ మీటర్ నంబర్ అడిగితే ఏకంగా మీటర్ నే పీకి తెచ్చింది

విద్యుత్ మీటర్ నంబర్ అడిగితే ఏకంగా మీటర్ నే పీకి తెచ్చింది

– ఏటూరునాగారంలో వింత ఘటన

ఏటూరునాగారం, డిసెంబర్29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో గ్యారంటీ పథకాల కోసం లబ్ధిదారులు ఫారాలను నింపి ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులను సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలపాలని సూచించారు. అయితే ఏటూరునాగారం మండలంలో ఓ వృద్ధురాలు గృహజ్యోతి పథకంలో ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ నెంబర్ కోసం ఏకంగా మీటర్లు తీసుకోవచ్చి అధికా రులకు చూపించారు.దీంతో ఆఫీసర్లు అవాక్కయ్యారు.వృద్ధురాలికి అవగాహన లేకపోవడంతో ఏకంగా మీటర్నే తీసుకొని గ్రామసభ కు వచ్చి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసిందని చర్చ జరుగుతుంది.