సీడిపిఓ అధ్యక్షతన పోషణ పక్వాడ్ కార్యక్రమం.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ ప్రాజె క్టు పరిధిలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని సిడిపిఓ అధ్య క్షతన నిర్వహించగా ఎంపీడీవో ఏపీఎంలు ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ 3నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యను అంది స్తామని వాటి ద్వారా శారీరక, మానసిక, సాంఘిక స్థాయి మెరుగుపడుతుందని వివరిం చారు. పుట్టగానే పిల్లలకు ముర్రుపాలు తాగించాలని 6 నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలని అలాగే అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే బాలామృతం, గుడ్లు, పిల్లలు తప్పనిసరిగా తినేలా చూడాలని దీని ద్వారా పిల్లలు శారీరకంగా అభివృద్ధి చెంది చదువులో రాణించడానికి దోహదం చేస్తుందని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఒక్క పూట పూర్తి భోజనాన్ని గర్భిణీలు, బాలింతలు తినేలా చూడాలని దీని ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధరకు ఎక్కువ పోషక విలువలు ఉండే రాగులు, సజ్జలు, జొన్నలు, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. రోజు ఆహారంలో వీటిని తీసుకోవాలని సూచించారు. పోషణ పక్వాడ్లో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్న ప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సూప ర్వైజర్ సరస్వతి, అరుణ, మమత, నాగమణి ,రమాదేవి, భాగ్యలక్ష్మి, పోషణ అభిమాని డి పి ఏ స్వప్న మరియు అంగన్వాడీ టీచర్స్, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.