నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మిర్చి నారు నర్సరీ పెంపకం

Written by telangana jyothi

Published on:

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మిర్చి నారు నర్సరీ పెంపకం

– భారీ వర్షాలకు తట్టుకునే విధంగా షేడ్ నెట్ ఏర్పాటు. 

– సినిమా షూటింగ్ సెట్ ను తలపిస్తున్న మిర్చినారు నర్సరీ. 

– వెంకటాపురంలో రైతు లక్ష్మణరావు చౌదరి వినూత్న ప్రయత్నం. 

– దోమలు ఈగలు రాకుండా తెరలు ఏర్పాటు. 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో మద్దిపాటి లక్ష్మణరావు చౌదరి అనే ఆదర్శ రైతు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మిర్చి నారు పెంపకం చేపట్టారు. సొంతంగా సుమారు పదిహేను ఎకరాలకు పైగా వాణిజ్య మిర్చి పంటను రైతు సాగు చేస్తున్నారు. తమ సొంతానికి మిర్చి నారును తాను నివాసం ఉంటున్న స్వగృహం పెరట్లోనే మిర్చి నారు పెంపకం ఏర్పాటు చేశారు. మార్కెట్లో ఎండు మిర్చి కి మంచి రేట్లు కలిగిన,మరియు అధిక దిగుబడి ఇచ్చే యూ.ఎస్. 341, దేవనూర్ డీలక్స్, మ్మ కో కంపెనీ, గోల్డెన్ ప్యారేట్, 341 సెగ్మేట్, ఇంకా అనేక రకాల కంపెనీల మిర్చి విత్తనాలు మార్కెట్లో ఆయా రైతుల అనుభవాలను బట్టి మిర్చి సీడ్ ను కొనుగోలు చేశారు. ఆగస్టు రెండో వారం నుండి మిర్చి నారు పోసే సీజన్ ప్రారంభంతో, మిర్చి నారు దిబ్బలు కట్టే పనులతో గ్రామాల్లో కోలాహాలం నెలకొన్నది. ఆయా మిర్చి కంపెనీల వివిధ రకాలను బట్టి కిలో విత్తనాలు 70 వేల నుండి లక్ష రూపాయలు వరకు మార్కెట్లో రైతులు ఆథరైజ్ డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. అలాగే ఏడు గ్రాములు కలిగిన విత్తనాలు ప్యాకెట్లు లో 1,500. మిర్చి గింజలు ఉంటాయి. అత్యంత సున్నితమైన మిర్చి మొక్కలు, భారీ వర్షాలకు మరియు అధిక ఎండలకు తట్టుకోలేదు. సున్నితమైన మిర్చినారును నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వేల రూపాయలతో కొనుగోలు చేసిన విత్తనాలను నూటికి, నూరు శాతం మొలక వచ్చి మిర్చి నారు చేతికి అందే విధంగా పెంచేందుకు రైతు లక్షణరావు ప్లాస్టిక్ ట్రేలను తెప్పించారు. ఒక్కొక్క ట్రే లో 98 మొక్కలతోపాటు, 110 మొక్కలు గింజలు నాటే విధంగా రెండు రకాల ట్రేలను తెప్పించారు. ఒక్కొక్క ట్రే లోని రంధ్రాలలో కొబ్బరి ఫీట్ చెందిన రకరకాల పోషక పదార్థాలు కలిగిన , మొక్క పెంపకానికి కావలసిన భూసారం అందే విధంగా ,ట్రే లలో కొబ్బరి పీట్ ను నింపి ఒక్కొక్క రంద్రానికి ఒక్కొక్క గింజ చొప్పున నాటించారు. అలాగే అధిక వర్షాలు నేరుగా మొక్కల మీద పడకుండా, భారీ వర్షాలను తట్టుకునేందుకు , చినుకులను భూమి ఆకర్షణన శక్తి నుండి, లావు చినకులు,మరయు తుఫాన్ వర్షాలు ను నారు దిబ్బల నుండి డైవర్ట్ చేసేందుకు, నెమ్మదిగా నీళ్లు నేల జారేందుకు పందిరి మాదిరిగా షేడ్ నెట్ ఏర్పాటు చేశారు. అంతేకాక నారు దిబ్బలపై కూడ ప్లాస్టిక్ గూడు మాదిరిగా, రెండవ నీటీ రక్షణ కవచంగా పరిచారు. వర్షాలు లేని సమయంలో రెండవ రక్షణ కవచాన్ని తొలగించి, తిరిగి మబ్బులు వాతావరణ మార్పులు ప్రకారం, మిర్చి దిబ్బలపై ప్లాస్టిక్ ట్రేలపై రెండవ రక్షణ కవచాలు కప్పే విధంగా ఏర్పాటు చేసు కున్నారు. మానవ శక్తితో నీటి తడులు కాకుండా స్ప్లింక్లర్, మరియు డ్రిప్ పద్ధతిలో పైప్ లైన్లు అమర్చారు. అలాగే నారుమడుల లోనికి,కుక్కలు ,కోళ్ళు ప్రవేశించకుండా, చుట్టు నెట్ కట్టారు. మిర్చి గింజలు నాటిన నుండి సుమారు 45 రోజులు వయసు వచ్చిన తర్వాత మిర్చి మొక్కలను తోటల్లో మల్చింగ్ షీట్ విధానంతో నాటేందుకు రైతాంగం నారు మళ్ళు పెంపకాన్ని చేపట్టింది. వెంకటాపురం పట్టణంలోని అప్పాల వారి వీధిలో, ఆదర్శ రైతు మద్దిపాటీ లక్ష్మణరావు చౌదరి హైటెక్ విధానం లో మిర్చినారు పెంపకం, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించిన ట్రేలు, షెడ్ అలంకరణ సినిమా షూటింగ్ సెట్ ను తలపించే విధంగా ఉండటంతో పలువురు రైతులు, రాక పోకలు సాగించే ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Leave a comment