సీతక్క గెలుపు పట్ల మొక్కు చెల్లించిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు కోటి
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : అసెంబ్లీ ఎన్నికలలో సీతక్క గెలుపు పట్ల ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు మామిడి శెట్టి కోటి సోమవారం తన ఎత్తు బెల్లం (బంగారం )మొక్కు చెల్లించాడు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సీతక్క ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా అవకాశం రావాలని మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో తన స్వగ్రామమైన వెంకటాపూర్ గ్రామంలో ఎత్తు బెల్లం (బంగారం) సమర్పిం చడం జరిగిందని అన్నారు. మేడారం సమ్మక్క సారక్కల ఆశీర్వాదాలు ప్రజలందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.