స్టెనో, రికార్డు అసిస్టెంట్ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్టెనో, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కోర్టులోని న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్టెనో / టైపిస్ట్ (01) పోస్టుకు గాను డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, షార్ట్ హ్యాండ్ (హయ్యర్) నిమిషానికి 120 పదాల స్పీడ్, మరియు ఇంగ్లీష్ (హయ్యర్ ) నిమిషానికి 45 పదాల టైప్ వచ్చి ఉండాలని, రికార్డు అసిస్టెంట్ (01) పోస్టుకు గాను 10వతరగతి పాసై ఉండాలని సూచించారు. ఇట్టి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ నోటిఫికేషన్ జారి చేశారు. నవంబర్ 25, 2024 రోజు సాయంత్రం 5గంటల లోపు రిజిస్టర్ పోస్ట్ /స్పీడ్ పోస్ట్ ద్వారా చైర్ పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ములుగు డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ అడ్రస్ కు దరఖాస్తు అందించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను https://mulugu.dcourts.gov.in/సంప్రదించాలన్నారు.