ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ 

Written by telangana jyothi

Published on:

ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లా ఆర్య వైశ్య మహాసభ నూతన అధ్యక్షుని ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఆర్యవైశ్య మహా సభ నియమావళి ప్రకారం 2024 – 2026 రెండు సంవత్సరా లకు గాను ఎన్నికలు వర్తిస్తాయని పేర్కొంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఈ పర్యాయం ఎన్నికలలో పాల్గొనుటకు కాటారం రెవిన్యూ డివిజన్ కు చెందిన ఆర్య వైశ్య సభ్యులు అర్హులుగా ప్రకటిస్తూ జిల్లా అధ్యక్షులు అయి తు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2న నామినే షన్ ప్రక్రియ ప్రారంభం కాగా నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ ప్రక్రియలు కొనసాగిన అనంతరం కౌంటింగ్ ఫలితాలను  వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a comment