ములుగు గిరిజన యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీలో 2024-2025 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ అధి కారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఏ ఇంగ్లీష్ (ఆనర్స్), సోషల్ సైన్సెస్ (ఆనర్స్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి కోర్సులో25+8 విద్యా ర్థులకు ప్రవేశం కల్పిస్తారని, కోర్సు కాలవ్యవధి 4 ఏల్లు కాగా.. ఈనెల 26 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.