నన్నెవరు ఏం చేయలేరు – అందరికి ముడుపులు ఇస్తున్నా..!

Written by telangana jyothi

Published on:

నన్నెవరు ఏం చేయలేరు – అందరికి ముడుపులు ఇస్తున్నా..!

– రాజకీయ అధికారుల అండలు నాకు ఉన్నాయి..?

– బడా డాన్ బరితెగింపు మాటలు

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: గోదావరి నది ప్రక్కన ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఏటూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతోంది. అక్రమ మట్టి రవాణాపై ప్రశ్నించిన వారిని తనను ఎవ్వరు ఏం చేయలేరని అందరికి ముడుపులు అందుతున్నాయని అదే గ్రామానికి చెందిన రాజకీయ బడా డాన్ చెప్పడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.ఆదివారం సెలవు దినం కావడంతో మట్టిని టిప్పర్ లో అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ మట్టి రవాణాపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.అక్రమ మట్టి రవాణా డాన్ కు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అడింది ఆట పాడింది పాటగా ఏటూర్ గ్రామంలో కొనసాగుతోంది. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం మట్టి తరలిస్తున్నామని చెబుతున్న..సెలవు దినాల్లో దొంగ చాటుగా తరలించడం, ఏమిటో అర్థం కాని ప్రశ్న…? ప్రశ్నించే వారికి మాములు ఇస్తూ..లేని యడల బెదిరింపులు గురిచేస్తున్నా రు. అధికార పార్టీకి సంబంధించిన బడా నాయకుల ప్రోత్సా హంతో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ బిఅరెస్ పార్టీ నాయ కులు బడా డాన్ తో కుమ్మక్కు అయ్యారని, వారి సహకారం ఉందని, అందుకే ఈ విషయంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఇష్టా రీతిగా టిప్పర్లలో తరలిస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్ట నట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ మట్టి తరలిస్తున్న విషయం పై తహశీల్దార్ ఫోన్ లో సంప్రదించగా లిఫ్ట్ చేయలేదు. తరువాత ఆర్ ఐ గణేష్ ను ఫోన్ లో వివరణ కోరగా… తమ కేమీ సంబంధ లేదని, మట్టి తరలిస్తున్న ఫోటోలు పెట్టండని చెప్పారు. ఇప్పటికైనా అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేస్తారా….లేదా… అక్రమ రవాణా నాయకుల ఆగడాలకు రెవెన్యూ అధికారులు ఆజ్యం పోస్తారా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now