నూతన సంవత్సర వేడుకలను నిబంధనల మేరకే నిర్వహించాలి

నూతన సంవత్సర వేడుకలను నిబంధనల మేరకే నిర్వహించాలి

– నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు : సిఐ బండారి కుమార్

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : నూతన సంవత్సర వేడుకలు సెలబ్రేషన్ చేసుకునే ప్రతి ఒక్కరు పోలీసు వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సీ.ఐ .బండారి కుమార్ మండల ప్రజలకు తెలియజేశారు.మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడపరాదని, అదేవిధంగా 18 సంవత్సరాలు లోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని తెలియజేశారు. మైనర్లు వద్ద ద్విచక్ర వాహనాలను  చూసి నట్లయితే అట్టి ద్విచక్ర వాహనాలను పోలీసు నిబంధన ప్రకారం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతుందని, ఆపై భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, ద్విచక్ర వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకునే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మాత్రమే కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవాలని కోరారు. ఆకతాయిలు ఎవరైనా రోడ్లపై కేక్ కటింగ్ లు చేసి, పోలీస్ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ, పట్టుబడినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు డీజే బాక్సులు పెట్టి విపరీతమైన సౌండ్ తో ఇబ్బందు లు పెట్టవద్దని ప్రజలను సి.ఐ.బి.కుమార్ కోరారు.