కాటారంలో జాతీయ ఓటర్స్ డే ర్యాలీ

కాటారంలో జాతీయ ఓటర్స్ డే ర్యాలీ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిం చారు. మండల తహసిల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తహసిల్దార్ కార్యాలయం నుంచి గారేపల్లి అంబేద్కర్ కూడలి వరకు ప్లకార్డులు చేత భూని నినాదాలు చేస్తూ, ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగరాజు తో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్లూరి బాపు, మండల పంచాయతీ అధికారి వీరాస్వామి, కాటారం పంచాయతీ కార్యదర్శి షాకీర్ ఖాన్ తో పాటు పలు గ్రామపంచాయతీల కార్యదర్శులు, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.