ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ములుగు ప్రతినిధి :  జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జె సోమన్న ఆధ్వర్యంలో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దే శించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొప్పుల మల్లేశం మాట్లా డుతూ భారత క్రీడారంగానికి ప్రత్యేకంగా హాకీ క్రీడకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ సేవలను కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ఆసక్తిని చూపినప్పుడే శారీరక మరియు మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థులకు కళాశా ల అన్ని రంగాల్లో అండగా ఉంటుందని పేర్కొన్నారు. కళాశా ల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జె సోమన్న మాట్లాడుతూ 1928, 1932 మరియు 1936 ఒలంపిక్ క్రీడల్లో భారత హాకీ జట్టు ధ్యాన్ చంద్ అసమాన క్రీడా సామర్థ్యం వలన బంగారు పతకాన్ని గెలిచిందని పేర్కొన్నారు. భారత హాకీ కి ఎనలేని సేవలందించిన గొప్ప వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్ అని తెలిపా రు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి బాలయ్య మాట్లాడుతూ నేటి యువత ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరా లను అధిరోహించాలని పేర్కొన్నారు. అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ సి.హెచ్. భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అన్ని రంగాల్లో ముందుం డాలని కోరాడు. కళాశాల న్యాక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. కవి త మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్ అంశాలే కాకుండా క్రీడలు వంటి అంశాల పట్ల కూడా ఆసక్తి చూపినప్పుడే విజయం సాధ్యమవుతుందని తెలిపారు.వంద మంది విద్యా ర్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డి. రాధిక, కే. సరిత, పి. నాగమణి, బి. శిరీష, ఎం. అనిల్ కుమార్, పి. ఉదయశ్రీ, పి. విజిత, జె. శంకర్, ఆర్. తేజోలత, టి. శ్రీను, హెచ్ రమేష్ మరియు కే. లక్ష్మి, వి. ఐలయ్య, ఎస్కే షరీఫా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment