జాకారం ఫొటోగ్రాఫర్ కు నేషనల్ ప్రీమియం అవార్డు
– అందించిన హైకోర్టు జడ్జి చంద్రకుమార్, జబర్దస్త్ ఫేం శేషు
ములుగు ప్రతినిధి : ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన రేకులపెల్లి రాజేష్ కు నేషనల్ ప్రీమియం అవార్డు లభించింది. ఫొటో గ్రఫీ పీల్డ్ లో రాణిస్తున్న రాజేష్ బెస్ట్ ఎడిటర్, బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్ బొగ్గులకుంట సరస్వత పరిషత్ ఆడి టోరియంలో జరిగిన నేషనల్ ప్రీమియం అవార్డు – 2025 లో హైకోర్టు జడ్జి చంద్ర కుమార్, జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు, సంస్థ ఫౌండర్ పరిపెల్లి రవిశ్రీ, గౌరీశ్రీ చేతుల మీదుగా అందుకు న్నారు.తాను యూట్యూబ్ లో వచ్చే ఫోక్ సాంగ్స్, డాక్యుమెం టరీ షూట్లకు మంచి ఫొటోగ్రఫీ నిర్వహించేవాడినని, అందుకు గాను ఈ అవార్డు లభించింద న్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో ఆరేళ్లుగా ఈరంగంలో ముందుకు పోతున్నానని, ఈ అవార్డు రావడంపట్ల సంతోషంగా ఉందన్నారు.మరెన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు.