Nancharamma | ములుగు జిల్లాలో వైభవంగా నాంచారమ్మ జాతర

Nancharamma | ములుగు జిల్లాలో వైభవంగా నాంచారమ్మ జాతర

Nancharamma | ములుగు జిల్లాలో వైభవంగా నాంచారమ్మ జాతర

– వేలాదిగా తరలివచ్చిన భక్తులు 

– వేదమంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్ట 

– మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపురంలో ఎరుకల నాంచారమ్మ జాతర సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ద పౌర్ణమి రోజున జరిగే ఈజాతరను నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం లక్ష్మీదేవిపేట గ్రామం నుంచి ఎరుకల ఆచారం ప్రకారం కోలాట బృందాలు, డప్పు చప్పుల్లతో బోనాలు తీసుకువచ్చారు. రామానుజాపూర్ గ్రామంలో గ్రామదేవతలకు మొక్కులు చెల్లించిన అనంతరం తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆధ్వర్యంలో భక్తులు తరలిరాగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నాంచారమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.నాంచారమ్మ వేషధారణలతో ఉన్న మహిళలు కవితకు ఎరుక (సోది) చెప్పారు. నాలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఎరుకల కులస్తులతో పాటు గ్రామాల ప్రజలు నాంచారమ్మను దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నాంచారమ్మను దర్శించుకున్నారు. నాంచారమ్మ దేవస్థానంలో మానుపాటి సామమూర్తి, బిజిలి రామయ్యలు అన్నదానం చేశారు.

ఎరుకల ఆత్మగౌరవం కోసమే వచ్చా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Nancharamma | ములుగు జిల్లాలో వైభవంగా నాంచారమ్మ జాతర

ఎరుకల ఆత్మగౌరవం కోసమే హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చానని, నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని, మరింత రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నాంచారమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు ఆధ్వర్యంలో ఎరుకల సంఘం నాయకులు టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కవితకు సాదరంగా స్వాగతం పలికారు ఎరుకల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాల ఇక్కడి కార్యక్రమం జరుగుతుందన్నారు. సంస్కృతిని రక్షించుకోవాలని, ఉత్సవాలకు ప్రభుత్వం కూడా చేయూతనందించాలని కోరారు. ములుగు నుంచి మంత్రి సీతక్క ఉన్నారు కాబట్టి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతునాన్నని అన్నారు. ఇదివరకు చందులాల్, సత్యవతి రాథోడ్ పని చేసినప్పుడు అందరు కూడా శ్రద్ధ పెట్టి ఈ ఉత్సవాలకు చేయూత అందించారని అన్నారు. ఎరుకల కులస్తులు వెనుక బడి ఉన్నారని, వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ నేతృత్వంలో చేపట్టడం జరిగిందని, ఎరుకల ఎంటర్ప్రియన్స్ స్క్రీన్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసిఆర్ ఆలోచన విధానంతోనే మంచి కార్యక్ర మాలు చేపట్టారని అన్నారు. అటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నాసరే కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని కవిత కోరారు. నాంచారమ్మ వేషధారణతో ఉన్న వారితో సోది (ఎరుక) చెప్పించుకున్నారు అనంతరం అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, జాగృతి నాయకులు అంతటి రాము, రాజ్ కుమార్, ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాటి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ ఆనంద్, కేంసారం నాగులు, సురేష్, రవి, నరేష్, ములుగు జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి నాయకులు పల్లకొండ భాస్కర్, పాలకుర్తి సురేష్, కేతిరి సారయ్య, అశోక్ పల్లకొండ ఎల్లస్వామి, మేడ బంగారయ్య, సాళ్ళ బాబు, నాంచారమ్మ ఆయా జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

మూడోసారి జాతరకు వచ్చా : భూపాలపల్లి ఎమ్మేల్యే గండ్ర 

Nancharamma | ములుగు జిల్లాలో వైభవంగా నాంచారమ్మ జాతర

మొదటిసారి ఎన్నికలకు ముందు నాంచారమ్మ జాతరకు వచ్చా నని, నాంచారమ్మ ఆశీస్సులతో గెలిచాక రెండోసారి వచ్చా నని, వరుసగా 3వ ఏడాది నాంచారమ్మను దర్శించుకుంటున్నానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మండలంలోని రామాంజాపూర్ నాంచారమ్మ జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం సత్యనారాయణ రావు మాట్లాడారు. నాంచారమ్మ తల్లి ఎరుకల జాతికే కాకుండా యావత్తు ప్రజలందరి కూడా ఆశీస్సులు అందిస్తుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు తనతో ఫోన్లో మాట్లాడారని, అదిలాబాదులో అంబేద్కర్ స్టాచ్యూ , ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడంతో రాలేకపోయారని, రోడ్డు, దేవాలయం అభివృద్ధి చేద్దాం మీరు తప్పకుండా పోయి రావాలని నాతో మాట్లాడడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పురాతనమైనటువంటి దేవాలయాలకు ఊతమిచ్చే విధంగా పనిచేస్తుందన్నారు. నాంచారమ్మ దేవాలయం అభివృద్ధి చేసేటు వంటి శక్తిని ఇంకా మాకు ఇవ్వాలని, అదేవిధంగా నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా తల్లి ఆశీస్సులు ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం భూపాలపల్లి నాయకుడు కేతిరి సుభాష్, ములుగు జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి నాయకులు పల్లకొండ భాస్కర్, బైరెడ్డి భగవాన్ రెడ్డి, బుర్ర సమ్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment