వెంకటాపురం, వాజేడులో ముస్తాబైన అమ్మవార్ల గద్దెలు
– భక్తులు సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండ లాల్లో శ్రీ సమ్మక్క శ్రీ సారలమ్మల జాతర సందర్భంగా ఆయా ఉత్సవ కమిటీలు గద్దెలను అందంగా అలంకరించి జాతరకు ముస్తాబు చేశారు. బుధవారం నుండి శుక్రవారం వరకు జరిగే నాలుగు రోజుల అమ్మవార్ల పండుగ సందర్భంగా ఊరేగింపుతో వనదేవతలను తీసుకొని వచ్చుట, అమ్మవార్లు గద్దెనెక్కుట అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేశారు. వెంకటాపురం, చర్ల రహదారిలోని అబ్బ రాసి బండలు ఎదురు గొట్టలపై వెలసి ఉన్న శ్రీ సమ్మక్క శ్రీ సారక్క పగిడిద్ద రాజు, ఆడమరాజు, పిడమరాజు, ధర్మరాజు అనుబంధ దేవతల జాతర ఉత్సవాలను ఘణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి పక్కనే నాలుగు రోజులు పాటు జాతర సందర్భంగా దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పందిళ్లు, పాకలు తయారు చేసుకున్నారు. జాతరకు ఏర్పాట్లన్నీ పూర్తి కావస్తున్నాయని ఆలయ పూజారి తలపతి పూనెం సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా బీసీ మర్రిగూడెంలోని అమ్మవారి గుడి , శివాపురం లోని అమ్మవారి ఆలయాల వద్ద నెలకొని ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెల వద్ద ఏర్పాట్లను పూర్తి చేసి గిరిజన సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు.
1 thought on “వెంకటాపురం, వాజేడులో ముస్తాబైన అమ్మవార్ల గద్దెలు”