Mulugu SP | మావోయిస్టులారా లొంగిపోండి

Mulugu SP | మావోయిస్టులారా లొంగిపోండి

Mulugu SP | మావోయిస్టులారా లొంగిపోండి

– ప్రభుత్వ పునరావాసం కల్పిస్తాం

– జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్

– ములుగులో 22మంది మావోయిస్టు సభ్యుల లొంగుబాటు

ములుగు ప్రతినిధి,  తెలంగాణజ్యోతి : నిషేధిత మావోయిస్టు పార్టీలో కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయక ఆదివాసీ గిరిజనులు బలవుతున్నారని, ప్రభుత్వం కల్పిస్తున్న పునరా వాసం లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తామని, వెంటనే అగ్రనేతలతో సహా అందరూ లొంగిపోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ పిలుపునిచ్చారు. పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆఫీసర్ల సమక్షంలో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 22మంది సభ్యులు శుక్రవారం ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అందులో ముగ్గురు అసిస్టెంట్ కమాండెంట్ లు (ఏసీఎం), ఒకరు పార్టీ సభ్యుడు, 18మంది పూజారీ కాంకేర్ (ఆర్పీసీ) సభ్యులు లొంగిపోయారు. ఈ సంద్భంగా ఎస్పీ అందుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెంకు చెందిన మడవి మాస అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో పనిచేస్తు న్నాడు. 2010లో మావోయిస్టు పార్టీలో చేరి కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడు. 2013లో ఏసీఎంగా పదోన్నతి పొంది 2017లో బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణిం చిన అంబుష్ ఘనటలో, బూర్కపాల్ రోడ్డు పనుల రక్షణ కోసం వచ్చిన 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘనటో, 2021లో టేకుల గుర్మా గ్రామం వద్ద 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘనట్లో పాల్గొన్నాడు. అదేవిధంగా చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన ముచ్చకి జోగారామ్ అలియాస్ జోగా పామెడ్ ఏరియా కమిటీ లో ఏసీఎం హోదాలో పని చేస్తున్నాడు. 2016లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది కోమటిపల్లి ఆర్పీసీ మిలిషియా చీఫ్ గా పనిచేశాడు. 2017 ఏప్రిల్ నెలలో బుర్క పాల్ గ్రామం వద్ధ 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించన ఘటనలో, పామెడ్ పీఎస్ పరిధిలోని ధర్మారం క్యాంప్ పై దాడి చేసిన ఘటనలో నిందితుడు. అదేవిధంగా చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తుమ్మిరిగూడ గ్రామానికి చెందిన తాటి జోగా పువ్వార్తి ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్, ఏసీఎం హోదాలో పని చేస్తున్నాడు. 2016లో పార్టీలో చేరి 2020లో ఏరియా కమిటీ సభ్యుడిగా ప్రమోషన్ పొంది పలువు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటనల్లో నిందితులుగా ఉన్నాడు. పూణెం సుక్కు, కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ అధ్యక్షుడు అయిన కోరం పాపారావు, సభ్యులు రౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాససోడి, మడకం దేవా, మడవి జోగా, బిరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్, షూరిటీ రవన్న, కొత్తకొండ మజ్జి హైమావతి, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు సైతం అజ్ఞాతం వీడి స్వచ్ఛందంగా లొంగిపోయి కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని, లొంగి పోయిన మావోయిస్టులకు జీవన ఉపాధి, పునరావాసం కల్పిస్తా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఆర్పిఎఫ్ పీఎంజీ పంచమీలాల్, ములుగు డీఎస్పీ రవీందర్, వెంకటాపురం సీఐ బండారు కుమార్, పస్రా సీఐ జి.రవీందర్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, కన్నాయి గూడెం ఎస్ఐ వెంకటేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment