Mulugu sp aalam | తుఫాను పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్ పి గౌష్ ఆలం 

Mulugu sp aalam | తుఫాను పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్ పి గౌష్ ఆలం 

ములుగు, డిసెంబర్05, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : వాతావరణ శాఖ ద్వారా మిచాంగ్ తుఫాను ప్రభావంతో ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినందున భారీ వర్ష పాతంతో పాటు ఈధురు గాలులు సంభవించే అవకాశం ఉండడంతో ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గౌష్ ఆలం సూచించా రు. ఈదురు గాలులతో కరెంటు వైర్లు ,చెట్లు విరిగి పడే ప్రమాదం ఉన్నందున అవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దన్నారు. వరద ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధి లో డీడీఆర్‌ఎఫ్ ( డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ – జిల్లా విపత్తు రక్షణ బృందం ) టీమ్‌ను ఉంచడం జరుగు తుందని, వీరితో పాటు పోలీస్ స్టేషన్ అధికారులు సైతం తాడు, ట్యూబ్‌లు, విజిల్స్, టార్చ్ లైట్లు, పెట్రోల్, వుడ్ కట్టర్స్, మొదలైన ప్రాథమిక వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. స్టేషన్ హౌస్ అధికారులు వారి పరిధిలో తుఫాను సంబంధిత సమాచా రాన్ని పొందడంలో చురుకుగా వ్యవహరించాలని, రోడ్ల పై చెట్లు విరిగి పడితే వాటిని తొలగించడానికి తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా జంపన్న వాగు , గుండ్ల వాగు , ప్రధాన చెరువులు, గోదావరి నది పరిసరాల లో నివసిస్తున్న ప్రజలు అప్రమతంగా ఉండాలని భారీ వర్షపాతం నమోదు అయితే వెంటనే దగ్గరలోని ఎత్తైన సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని, ప్రమాదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా జిల్లా ఎస్ పి కోరారు.