కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
నిజామాబాద్ ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ను ఎంపీ అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్ర వారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పట్టణాల అభివృద్ధి, పురో గతిపై చర్చించారు. వారివెంట జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జ్యోతీలక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకుడు మోరే పల్లి సత్యనారాయణ తదితరులున్నారు.