మేడారం నుంచి హన్మకొండకు హుండీల తరలింపు.
మేడారం నుంచి హన్మకొండకు హుండీల తరలింపు.
ములుగు, తెలంగాణ జ్యోతి : నేడు మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించనున్నారు. హన్మకొండ లోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించి అక్కడ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించను న్నారు. 29 నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీ లను అధికారులు ఏర్పాటు చేశారు. హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది.