రోడ్డు ప్రమాదాలు నివారించడంలో వాహనదారులు నిబంధనలు పాటించాలి
రోడ్డు ప్రమాదాలు నివారించడంలో వాహనదారులు నిబంధనలు పాటించాలి
– ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : రోడ్డు ప్రమాదాలను నివారించడంలో వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి వై జంక్షన్ వరకు ఏటూరునాగారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపిఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీని వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ పోలీసులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రజా ప్రతినిధులు, యువత, తదితరులు పాల్గొన్నారు.