ధన్వాడలో తల్లి పాల వారోత్సవాలు

ధన్వాడలో తల్లి పాల వారోత్సవాలు

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఘనంగా తల్లిపాలు వారోత్స వాలను నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామస్థులకు, గర్భిణీ లకు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను అవగాహన కల్పిం చారు. బిడ్డ పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించా లని సూచించారు. తల్లిపాలతో శిశువుకు మంచి పౌష్టికా హారం అంది ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని వివరిం చారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కారెంగుళ శ్రీలత, తిత్తుల రజిత గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.