ప్రభుత్వ ఉపాధ్యాయునికి మథర్ తెరిసా జాతీయ సేవా పురస్కారం

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ ఉపాధ్యాయునికి మథర్ తెరిసా జాతీయ సేవా పురస్కారం

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ ఉపాధ్యా యుడు, సామాజిక సేవకుడు గజ్జెల సుమన్ మథర్ తెరిసా జాతీయసేవా పురస్కారం అందుకున్నారు. విజయవాడ హనుమంతరాయ పౌర గ్రంధాలయంలో మథర్ సర్వీస్ సొసైటీ రెండవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా మరియు ఇతర రాష్ట్రాలలో కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో కృషి చేస్తున్న వారిని గుర్తించి వివిధ పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారంకు చెందిన హన్మకొండలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న సామాజిక సేవకుడు, బ్లడ్ డోనర్ మరియు మోటివేటర్ మరియు యువనేతాజీ ఫౌండేషన్ ప్రధాన సభ్యుడు గజ్జెల సుమన్ కు మథర్ సర్వీస్ సొసైటీ ఫౌండర్ మల్లాది ప్రసాదరావు మరియు అతిధులు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ దాసు, మనం ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి, హెల్ప్ ఫౌండేషన్ (సత్తనపల్లి) వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబులు మథర్ తెరిసా జాతీయ సేవా పురస్కారం అందజేశారు. ఈ సందర్బంగా గజ్జెల సుమన్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందజేసిన మథర్ సర్వీస్ సొసైటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పడం జరిగింది. గజ్జెల సుమన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే 18 సార్లు రక్తదానం చేయడంతో పాటు ఎంతో మందిచే రక్తదానం చేయించడం, అనేక అనాధాశ్రమాలు మరియు వృద్ధా శ్రమాలలో అన్నదానం చేయించడం జరిగింది. కరోనాకా లంలో రోడ్లపై, ఫుట్ పాత్ పై ఉన్న వారికి ఆహార పొట్లాలు అందించడంతో పాటు ఎంతో మందికి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. మరియు ఎంతోమంది పేదవారికి మరియు అనాధలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ సందర్భంగా గజ్జెల సుమన్ ను పలువురు మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.ఈ కార్యక్రమంలో విజయ వాడ సినీ ఆర్టిస్టులు, నేషనల్ ఎన్జీవో ప్రతినిధులు, టీవీ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మరియు సింగర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment