రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడిని కలిసిన మోతె రమేష్
ములుగు ప్రతినిధి : ఇటీవల జరిగిన ములుగు జిల్లా రైస్ మిలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన బాధం ప్రవీణ్ ను ములుగు జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షులు మోతె రమేష్, కాలే వెంకటేష్, గద్దల రాజేందర్ లు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మా నించారు.రాజకీయ నాయకుడిగా సామాన్య ప్రజలకు ప్రభు త్వ పరంగా సంక్షేమ పథకాలు అందేలా సహాయం చేయడమే కాక, సమాజంలో సాటి మనిషికి కష్టమొస్తే నేనున్న అంటూ తనదైన శైలిలో సహాయం చేస్తు, ఆపద సమయంలో ఆదు కుంటున్న మృదు స్వభావం గల ఉత్తమమైన వ్యక్తి బాదం ప్రవీణ్ అని మోతె రమేష్ అన్నారు. అటువంటి మంచి మనసున్న వ్యక్తి నేడు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తమకు ఆనందంగా ఉందని వారు తెలిపారు. రైస్ మిల్ అధ్యక్షుడిగా ఉంటూ రైతులకు ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన నిలబడ్డమే కాక, ముందు ముందు మరిన్ని సహాయ సహకారాలు చేస్తూ పేద ప్రజలకు మరిన్ని సేవలు తన వంతుగా అందించాలని వారు కోరారు.