సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ లో మాక్ ఎలక్షన్స్
సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ లో మాక్ ఎలక్షన్స్
వరంగల్ : వరంగల్ జిల్లా లేబర్ కాలనిలోని శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్ నందు మాక్ ఎలక్షన్స్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ శశిధర్మా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎన్నికల పట్ల అవగా హన కలిగడానికి సరైన నాయకత్వం గల నాయకున్ని ఎన్ను కోవడానికి, రాజకీయ పార్టీల నాయకుల గురించి తెలుసుకో వడానికి ఈ మార్క్ ఎన్నికలు ఎంతో దోహదపడతాయని అన్నారు. తద్వారా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని ఎంపి క చేసుకునే అవకాశం లభిస్తుందని వారు తెలియజేశారు. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం లో రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు నిర్వహించాలని రాబోయే రోజుల్లో ఎటువంటి ఎన్నికలు జరిగినా తమ తల్లిదండ్రులు సైతం డబ్బుకు మధ్యానికి బానిస కాకుండా వాటిని తీసుకో కుండా స్వచ్ఛందమైన ఓటు వేయాలని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు విద్యార్థులు వివరించేలా వారిని ప్రోత్సహించి నట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన ఈ మాక్ ఎన్నికల్లో పదవ తరగతి చెందిన కే వర్ధన్,పి.సంజయ్, ఏ రాఘవ ముగ్గురు పోటీ చేసారని అందులో మొత్తం 120 ఓట్లకు గాను 72 ఓట్ల తో పి సంజయ్ మొదటి స్థానంలో నిలిచి విజయం సాధించడం జరిగిందని. విజయం సాధించిన శాలువాతో సన్మానించి అభినందించినట్లు శశిధర్ రెడ్డి తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ ఆఫీసర్లుగా ఉపాధ్యా యులు సిద్ధోజు స్వాతి, రిజ్వానా, అనుష, రత్నం, నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులంతా స్వచ్ఛందంగా ఎంతో సంతోషంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.