వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఖానాపురం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా అశోక్ నగర్ సైనిక్ స్కూల్ ఆవరణలో 1500 మొక్కలు నాటే కార్యక్రమంలోఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలను ప్రభుత్వం నాటనున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు ముఖ్యం అని అన్నారు..ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్, ఖానాపూరం మండలం ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు, అశోక్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఏల్ది. శ్రీనివాస్, ఆశా వర్కర్లు, మహిళా మండలి సంఘాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.