జయశంకర్ ఫౌండేషన్ సేవలను అభినందించిన ఎమ్మెల్యే.
తెలంగాణ జ్యోతి /మహాదేవపూర్ : ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద ప్రజలకు చేస్తున్న సేవలను భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చైర్మన్ అయిలి మారుతీ, మరియు వారి టీం ను అభినందించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషన్న, జాయింట్ సెక్రెటరీ కొత్తపెళ్లి రాజు, యూత్ ఇన్చార్జి చింతకింది రాజు, పుల్ల మహేష్, కంకాల మదన్న తదితర సభ్యులు పాల్గొన్నారు.