ములుగు జిల్లా వ్యాప్తంగా స్వల్ప భూకంపం.
ములుగు జిల్లా వ్యాప్తంగా స్వల్ప భూకంపం.
– భయాందోళనలతో పరుగులు తీసిన ప్రజలు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7 గంటల 27 సమయంలో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3 ఐదు పాయింట్ మూడు సెకండ్లు భూమి కంపించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందు వుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారు లు తెలియ జేశారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ములు గు జిల్లాలో అధికంగా భూమి కంపించింది.
తాడ్వాయి మండలంలో…
మండలంలో మూడు సెకండ్ల పాటు భూకంపం రావడం జరిగింది ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయందోళనతో ఇండ్ల బయటికి రావడం జరిగింది. ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కారణం జరిగింది ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
కన్నాయిగూడెం మండలంలో…
కన్నాయిగూడెం మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాల్లో భూమి కంపించింది. ఉదయం మహిళలు పురుషులు తమ తమ ఇండ్లలో ఉండగా 2 సెకండ్ ల పాటు భూమి కంపించడంతో కొందరి ఇండ్లలో వస్తువులు కింద పడిపోగా, ఇండ్లపై రేకులు భయంకరంగా శబ్దం చేయడంతో ప్రజలు ఆందోళనలతో బయటికి పరుగులు తీశారు.
వెంకటాపురం నూగూరు మండలంలో…
వెంకటాపురం మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల 26 నిమిషాల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు ఐదు నుండి ఆరు సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమి అటు ఇటు ఊగి పోయింది. ఇళ్లల్లో దైనందిన కార్యక్రమాల్లో ఉన్న ప్రజలు, గ్రుహస్తులు బయటికి పరుగులు తీశారు. బహుళ అంతస్తులు భవనాలు, రేకుల షెడ్లు, ఇతర ఇళ్లవారు, భూ ప్రకంపనల తో భయబ్రాంతులకు గురయ్యారు. కాగా, 1968 – 69 వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో భూకంపం సంబవిం చిందని మరల స్వల్పంగా భూమి కంపించిందని పలువురు వృద్ధులు చెప్పుకుంటున్నారు. ఒక్క సారిగా భూమి కంపిం చటంతో ఏజెన్సీ ప్రాంతాల్లోనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఏటూరునాగారం మండలంలో …
మండల వ్యాప్తంగా ఉదయం 7: 27 గంటల సమయంలో సెకండ్లపాటు సంభవించిన భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన రేకుల ఇల్లు గోడ కింద పడి పోయింది.